విశ్వక్ సేన్ ను పాగల్ అంటున్నారు

టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న కుర్రాడు విశ్వక్ సేన్. దర్శకుడు కావాలని వచ్చి నటుడుగా మారాడు. రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది సినిమాతోనే ఆకట్టుకున్నాడు. తర్వాత తన స్వీయ దర్శకత్వంలో చేసిన ఫలక్ నుమా దాస్ అనే సినిమాతో కమర్షియల్ గానూ విజయాన్ని అందుకున్నాడు. స్వయంకృషిని నమ్ముకుని ఎదుగుతోన్న విశ్వక్ కు రీసెంట్ గా నాని కూడా అండగా నిలిచాడు. తన బ్యానర్ లో హిట్ అనే సినిమాలో విశ్వక్ ను హీరోగా తీసుకుని మరో విజయం అందించాడు. హిట్ కు సీక్వెల్ ఉంటుందని చెబుతున్నా ఈ హీరో మాత్రం వేరే సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరే ‘పాగల్’.
బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో నరేష్ కుప్పిలి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అర్జున్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు రథన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అంటే ప్రస్తుతం ఉన్న ‘నో షూటింగ్’నిబంధన తొలగిన వెంటనే స్టార్ట్ చేస్తారట.

Related Articles

Back to top button
Send this to a friend