విలన్ కూతురుతో వరుణ్ రొమాన్స్

Varun Tej to romance Saiee Manjrekar

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా .. ఆ మూసలో పడిపోకుండా తనకంటూ సెపరేట్ ట్రాక్ ఫామ్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుని కొన్నాళ్లుగా కమర్షియల్ విజయాలు కూడా సాధిస్తూ వెళుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోష్ మీదున్న ఈ మెగా ప్రిన్స్ ప్రస్తుతం బాక్సింగ్ గేమ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ‘బాక్సర్’ అనే టైటిల్ తోనే రాబోతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా పరచయం అవుతున్నాడు. ఇక అల్లు అరవింద్ పెద్ద కొడకు నిర్మాతగా తన లక్ ను చెక్ చేసుకోబోతున్నాడీ చిత్రంతో.
కొన్నాళ్లుగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. కియారా అద్వానీ కోసం బాగా ట్రై చేశారు కానీ వర్కవుట్ అవలేదు. దీంతో మరో బాలీవుడ్ బ్యూటీని తెలుగులో పరిచయం చేయబోతున్నారు. గతంలో తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ను బాక్సర్ లో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈ అమ్మాయి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్-3 లో సినిమాలో నటించింది. ఇదే తన తొలి సినిమా. మలి సినిమా తెలుగులో పడింది. మరి ఈ భామతో బాక్సర్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం.

Related Articles

Back to top button
Send this to a friend