విజయ్ ని వదలమంటున్న ఐ.టి

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ పై ఐటి దాడులు ఆగేలా లేవు. కొన్నాళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులలోనూ సోదాలు జరిపింది ఐటీ శాఖ. విజయ్ గత కొన్ని సినిమాల్లో బిజెపి ప్రభుత్వ విధానాలపై సెటైర్స్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అతనిపై కక్ష సాధింపు చర్యగానే ఇలాంటివి జరుగుతున్నాయనే విమర్శలు అప్పుడు వినిపించాయి. అదే టైమ్ లో విజయ్ ఇంట్లో 60కోట్ల రూపాయలు నగదు దొరికిందన్న ప్రచారమూ జరిగింది. అయితే ఈ డబ్బు వ్యవహారాన్ని ఐటి శాఖ వెల్లడించలేదు. విజయ్ ను షూటింగ్ నుంచి బలవంతంగా తీసుకు వచ్చి సోదాలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం నాలుగు రోజుల సోదాల అనంతరం ఆ గొడవ సద్దుమణిగింది. అయితే ఇవాళ మరోసారి ఐటి అధికారులు విజయ్ ఇంటిలో సోదాలు నిర్వహించారు.
ఇలా వరుసగా ఓ స్టార్ హీరోను.. అదీ ఒక్కడినే టార్గెట్ చేయడంతో విమర్శకులకు కూడా బలం చేకూరింది. కేవలం ఇది తమపై సినిమాల్లో డైలాగులు వేశాడనే కక్షతోనే విజయ్ ని ఇలా ఇబ్బంది పెడుతున్నారనేది తేలిపోయిందంటున్నారు. మొన్న జరిగినప్పుడు అజిత్ సహా చాలామంది స్టార్లు ఐటి శాఖ విధానాన్ని తప్పు బట్టారు. మరి ఈ సారి ఈ వ్యవహారంపై ఎవరెలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend