విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చిన పూరీ జగన్నాథ్!

విజయ్ దేవరకొండ.. మూడుఫ్లాపుల తర్వాత అతనో సడెన్ స్టార్ అనే ట్యాగ్ పడిపోయింది. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ తో మనోడి సత్తా ఎంత చిన్నదో తేలిపోయింది. దీంతో ఇక బిజినెస్ సర్కిల్స్ లో విజయ్ క్రేజ్ పూర్తిగా పడిపోయిందనేది నిజం. అయితే ఈ మధ్య వచ్చిన అన్ని ఫ్లాపులకు కారణం అతనే అని ఆయా చిత్రాల దర్శక, నిర్మాతలు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయారు అనేదీ కూడా వాస్తవం అంటారు. ఎందుకంటే మనోడు పూర్తిగా కథల్లో వేలు పెడతాడు. దర్శకుల పనిని కూడా తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ కారణంగానే ఆ సినిమాలు పోయాయని అంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో నెక్ట్స్ సినిమాకు మరింత జాగ్రత్త పడాల్సింది పోయి మరోసారి అదే చేయాలనుకుంటున్నాడట.
విజయ్ ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. పూరీ కూడా వరుస డిజాస్టర్ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు. అయితే పూరీ విషయంలో ఈ హిట్టింగ్ కంటిన్యూ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే విజయ్ మరోసారి అతని కథలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశాడట. కానీ పూరీ మాత్రం ఈ విషయంలో అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనేలా పూరీ విజయ్ కి ఖచ్చితంగా చెప్పాడట. తను చెప్పింది చేస్తే చాలు.. నా పనిలో వేలు పెడితే కుదరదు అని కూడా తేల్చాడట. దీంతో ప్రస్తుతం పరిస్థితి బాలేదు కాబట్టి కామ్ అయిపోయాడట. మొత్తంగా మనోడికి ఇంకా చాల్లేదన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend