‘వి’కి సీక్వెల్ ఉందా..?

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈచిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. మామూలుగా ఈ నెల 25నే విడుదల కావాలి. కానీ రీ షూట్ కోసం పోస్ట్ పోన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ పైనే కాక వాల్డ్ మూవీపైన భారీ ఇంపాక్ట్ చూపించబోతోన్న నేపథ్యంలో ఏప్రిల్ లో కూడా రావడం గ్యారెంటీ లేదు. ఇక సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
వి సినిమాకు సీక్వెల్ ఉంటుందట. బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే క్వశ్చన్ తో బ్రేక్ వేసినట్టుగా ఇందులోనూ ‘నాని ఆ హత్య ఎందుకు చేశాడు’అనే కోణం నుంచి సీక్వెల్ కు లీడ్ ఉండబోతోందంటున్నారు. ఈ కారణంగానే నాని ఈ పార్ట్ లో తన పోర్షన్ చాలా తక్కువగా ఉన్నా ఒప్పుకున్నాడు. అలాగే ఈ పార్ట్ లో నెగెటివ్ గా కనిపించే నాని పాత్ర సీక్వెల్ లో ఫుల్ పాజిటివ్ గా కనిపిస్తుంది. ఆ పాజిటివ్ కోణం తీర్చుకునే రివెంజ్ నే ఈ మూవీలో కనిపిస్తుదంటున్నారు. మామూలుగా ఇలాంటి వార్తలు ఊరికే రావు. అలాగే ఇంద్రగంటి ప్రతిభావంతమైన దర్శకుడికి ఈకథ రాయడ అంత కష్టం కూడా ఏం కాదు. మొత్తంగా సుధీర్ బాబు(ఈ పార్ట్ లో)హీరోగా నివేదా థామస్, అదితిరావు హైదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందనేది ఖాయంగా వినిపిస్తోంది.

Related Articles

Back to top button
Send this to a friend