వాళ్ళ వల్లనే మనం సేఫ్ గా ఉన్నాం:అక్షయ్

అక్షయ్ కుమార్ పెద్ద పేరున్న హీరో నే కాదు అంతకన్నా గొప్ప మనసు ఉన్న మనిషి.అనేక సందర్భాలలో భారీ విరాళాలు ప్రకటించి చాలా మందిని ఆదుకున్నాడు.ఇప్పుడు కూడా మరో సారి అక్కి ది గ్రేట్ అనిపించే పని చేశాడు. ముంబై పోలీసుల కోసం 2కోట్ల విరాళం అందించాడు.ముంబై పోలీసు ఫౌండేషన్ కు అక్షయ్ 2కోట్లు ఇవ్వడం సంతోషంగా ఉందని పోలీసు ల ప్రాణ రక్షణ కు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది అని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది ముంబై పోలీసు శాఖ.ఆ ట్వీట్ కు స్పందించిన అక్షయ్ ” కరోనా తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ముంబై హెడ్ కానిస్టేబుళ్లు చంద్రకాంత్ పెందూర్కర్,సందీప్ సుర్వే ల కు నా సెల్యూట్.నా వంతు కర్తవ్యం గా నేను ఇది చేస్తున్నా, మీరు కూడా మీ బాధ్యత నిర్వహిస్తారు అనుకుంటున్నాను.మనం క్షేమంగా,భద్రత గా ఉండగలుగుతున్నామంటే అది పోలీసుల వల్లనే అని మర్చిపోకూడదు” అని ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button
Send this to a friend