వచ్చేది మెగా ఉగాది..

ఉగాది .. తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ పండగ ప్రత్యేకతం ఏంటంటే సినిమా వారికి అత్యంత ఇష్టమైన వేసవి సీజన్ ను మొదలుపెట్టేది ఈ పండగే. దీంతోపాటు తెలుగు సంప్రదాయాలన్నీ వెల్లివిరిసే సమయం. అందుకే తెలుగువారిని ఆకట్టుకునేందుకు మన సినిమా వాళ్లు కూడా రకరకాల ప్రమోషన్ పాట్లతో ఆకట్టుకోవాలని చూస్తుంటారు. అలా ఈ సారి ప్రతి హీరో కూడా ఏదో రకంగా పండగ రోజు పలకరించాలనుకుంటున్నారు. అయితే అందరిక కంటే ఈ సారి ఇది మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా కనిపించబోతోంది.. అంటున్నారు.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి, కొరటాల సినిమా టైటిల్ ను అఫీషీయల్ గా అనౌన్స్ చేస్తారు. మొన్న ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ టైటిల్ ను నోరు జారి చెప్పాడు చిరంజీవి.. ఈ కారణంగా కొత్త టైటిల్ కూడా పెడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచి ఓ టీజర్ విడుదల చేయొచ్చు అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పాట పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అందుకే ఈ టీజర్ తో ఆకట్టుకోవాలనుకుంటున్నట్టు టాక్.
ఇక ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా తెలుగు వాళ్లే కాదు.. మొత్తం దేశమంతా ఆసక్తిగా చూస్తోన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి చరణ్ లుక్ రావొచ్చు అంటున్నారు. అదే సమయంలో చరణ్ మాత్రమే కాదు.. రాజమౌళి ఇద్దరు హీరోల లుక్కులూ విడుదల చేస్తాడు అంటున్నారు.
ఈ లీగ్ లో తర్వాతి ప్లేస్ లో ఉన్న సాయితేజ్ కూడా తన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ నుంచి ఓ టీజర్ వదలొచ్చు అని వినిపిస్తోంది. లేదంటే లేటెస్ట్ గా ప్రారంభం అయిన దేవా కట్టా సినిమా టైటిల్ అయినా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటోన్న వరుణ్ తేజ్ కూడా బాక్సర్ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ తో రెడీగా ఉన్నాడు అనేది టాక్. తన లుక్ లేదా.. టైటిల్ పోస్టర్ తో పాటు మెయిన్ టీమ్ ఎలివేట్ అయ్యేలా ఓ పోస్టర్ ఉండొచ్చు అనే టాక్ ఉంది.
ఈ రేస్ లో చివరిగా ఉన్నవాడు.. కొత్తగా వస్తున్నవాడు వైష్ణవ్ తేజ్. సాయితేజ్ తమ్ముడుగా ఎంట్రీ ఇస్తోన్న ఈ రెండో మెగా మేనల్లుడు కూడా ఉప్పెన సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సారి టీజర్ తో రావొచ్చేమో..
మొత్తంగా ఈ సారి మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి హీరో కూడా ఉగాది సందర్భంగా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. చూద్దాం.. మరి ఈ మగా స్టార్స్ ను దాటి ఆకట్టుకునే ఇతర స్టార్లెవరో..?

Related Articles

Back to top button
Send this to a friend