వకీల్ సాబ్ ను వదలనంటోన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ కు రీమేక్ గా వస్తోన్న సినిమా ఇది. అయితే తెలుగులో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా అనేక మార్పులు చేసినట్టు సమాచారం. అంటే కంప్లీట్ గా కమర్షియల్ ప్యాక్ లా మలిచారీ చిత్రాన్ని అన్నట్టు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న వకీల్ సాబ్ లో అంజలి, నివేదా థామస్, అనన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు చిత్రాన్ని మే నెలలో విడుదలకు రెడీ చేస్తున్నాం అని గతంలోనే ప్రకటించారు. కానీ షూటింగ్ లు బంద్ అయిన సందర్భంగా ఇప్పుడు ఆ డేట్ కు రావడం కష్టమే అనుకోవచ్చు.
ఇక ఈ మూవీకి డేట్స్ అడ్జెస్ట్ చేస్తే అటు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమాకు ఇబ్బంది అవుతుంది. అందుకే వకీల్ సాబ్ ఎప్పుడు వస్తుందో గ్యారెంటీ లేదు అనే మాటలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వకీల్ సాబ్ ను వదలను అంటున్నాడట. అంటే ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాతే క్రిష్ వైపుకు వెళ్లాలనే ఆలోచనలో ఉణ్నాడు. అదీ మంచిదే. లేదంటే ఏ సినిమా కూడా ఎప్పుడు వస్తుందో తెలియక అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు నిర్మాతలు కూడా ఇబ్బంద పడతారు.
ఇప్పటికే వకీల్ సాబ్ మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. పవన్ కు సంబంధించి హీరోయిన్ తో ఉన్న ఎపిసోడ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి అతను పూర్తి చేస్తే మిగతా పార్ట్ దర్శకుడు చూసుకుంటాు అటు పవన్ కూడా వేర సినిమాకు వెళ్లొచ్చు. దీనివల్ల వీళ్లు ముందే చెప్పినట్టుగా మే 8న కాకపోయినా చివరి వరకూ అయినా విడుదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి.