లైవ్ ఆడిష‌న్ చేయనున్నడైరెక్ట‌ర్ తేజ‌

నెక్ట్స్ ఫిల్మ్ కోసం సోష‌ల్ మీడియాలో లైవ్ ఆడిష‌న్ నిర్వ‌హించ‌నున్న డైరెక్ట‌ర్ తేజ‌

Teja’s Live Audition On Soical Media For His Next Film
Teja’s Live Audition On Soical Media For His Next Filmడైరెక్ట‌ర్ తేజ త‌న త‌ర్వాతి సినిమాతో ప్ర‌తిభావంతులైన న‌టుల‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు. దీని కోసం టాలీవుడ్‌లోనే మొట్ట‌మొద‌టి సారిగా, సోష‌ల్ మీడియా వేదిక ద్వారా ఆడిష‌న్ నిర్వ‌హించ‌నుండ‌టం విశేషం. టాలీవుడ్‌కు ప్ర‌తిభావంతుల్ని ప‌రిచ‌యం చేసే ఈ అవ‌కాశాన్ని హ‌లో యాప్ చేజిక్కించుకుంది. హ‌లో యాప్‌లో అప్‌లోడ్ చేసిన అప్లికేష‌న్ల‌ను మాత్ర‌మే ఫైన‌ల్ ఆడిష‌న్ కోసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని తేజ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్లు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రెండు చిత్రాల్ని ద‌ర్శ‌కుడు తేజ అనౌన్స్ చేశారు. వాటిలో ఒక‌టి రానా ద‌గ్గుబాటితో తీసే ‘రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు’ సినిమా కాగా, మ‌రొక‌టి గోపీచంద్‌తో రూపొందించ‌నున్న ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ’ చిత్రం.
ఈ రెండింటిలో ఏ సినిమా కోసం ఈ ఆడిష‌న్స్‌ను నిర్వ‌హించ‌నున్నార‌నే విష‌యాన్ని త్వ‌ర‌లో వెల్ల‌డి చేస్తారు.

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami