లాస్ట్ పెగ్’ యాక్షన్ టీజర్ విడుదల

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ చిత్రం. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది. యువతీ యువకుడు ప్రేమలో పడితే చివరికి తల్లిదండ్రులు చూపించిన అబ్బాయితో ఆ అమ్మాయి నిచ్చితార్థం అవుతుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడు, మరియు నిచ్చితార్థం చేసుకున్న అబ్బాయి కలుస్తారు, ఇదంతా విధి ఆడిస్తున్న నాటకమని వారు భావిస్తారు. చివరికి ఏం జరిగింది ? ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకుంటారు అనే అంశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ సంజయ్ మాట్లాడుతూ… తాజాగా యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

నటీనటులు: భారత్ సాగర్, యశస్విని రవీంద్ర
టైటిల్: లాస్ట్ పెగ్
బ్యానర్: భవసపందన ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ & బిఎండబ్ల్యు
రచన, దర్శకత్వం: సంజయ్ వడత్. ఎస్
నిర్మాత: రజత్ దుగోజి సలేంకి
సంగీతం: లోకేష్
మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్.టి
డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల
ఎడిటర్: రుత్విక్
పిఆర్ఓ: సాయి సతీష్

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami