లాఠీ పట్టనున్న కోటి…!

మ్యూజిక్ డైరెక్టర్ కోటి తెలియని వారు ఎవరూ ఉండరు.సాలూరి వారి అబ్బాయి గానే కాకుండా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సుస్ధిర స్థానం ఏర్పరచుకున్నారు కోటి.స్వర పరచడమే కాక పాటలు పాడటం తో పాటు గా పాటల పోటీలకు న్యాయ నిర్ణీత గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు కోటి ప్రధాన పాత్ర లో ఒక సినిమా రెడీ అవుతోంది.”సుగ్రీవ” అనే సినిమా లో కోటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు..నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం లో ఎమ్మెన్నార్ చౌదరి ఈ సినిమా ని నిర్మించనున్నారు.ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా తట్టుకుని సమాజ శ్రేయస్సు కోసం విధులు నిర్వహించే పోలీసు అధికారుల కధే ఈ సుగ్రీవ అని,లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది అని నిర్మాత చౌదరి అన్నారు.తన పాట ద్వారా సామాజిక అంశాల పై ఎప్పటికప్పుడు స్పందించే కోటి ఇప్పుడు అలాంటి సామాజిక బాధ్యత కలిగిన పోలీసు పాత్ర ను ఎంచుకోవడం నిజం గా అభినందంచదగ్గ విషయం..

Related Articles

Back to top button