రోజురోజుకూ దిగుతోన్న నాగశౌర్య ప్రతిష్ట


నాగశౌర్య.. సొంత బ్యానర్ లో రీసెంట్ గా వచ్చిన అశ్వథ్థామ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ మాత్రం కొత్తదనం లేని కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాతో తన బ్యానర్ కూ షాక్ తప్పలేదు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తోన్న శౌర్య అశ్వథ్థామ టైమ్ లో చేసిన కమెంట్స్ చూపించిన యాటిట్యూడ్ ఇప్పుడు లేనిపోని తలనొప్పులు తెస్తోంది. నిజానికి ఈ మూవీ కథ తనదే అంటూ ఓ రేంజ్ లో గప్పాలు కొట్టాడు. కానీ ఒరిజినల్ రైటర్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేయడంతో కామ్ గా అతనికి కాంపెన్సేషన్ ఇచ్చిన సారీ కూడా చెప్పి తప్పించుకున్నాడు. కాకపోతే విషయం మరీ రచ్చ కాకుండా మేనేజ్ చేసుకోగలిగాడు.
ఇక కొన్ని రోజులుగా హీరోయిన్ మెహ్రీన్ పై లేనిపోని మాటలతో దాడి మొదలుపెట్టాడు. ఈ మూవీ టైమ్ లో మెహ్రీన్ హోటెల్ బిల్ కూడా కట్టలేదనే టాక్ వచ్చింది. అయితే మెహ్రీన్ వీరి వ్యవహారం తెలిసే చెప్పా పెట్టకుండా రూమ్ ఖాళీ చేసింది. దీంతో ఆ హోటెల్ వాళ్లు నిర్మాత ముక్కుపిండి మరీ వసూలు చేశారు. దీంతో ఇది అక్కసుగా తీసుకున్న శౌర్య అండ్ టీమ్ ఇప్పుడు మెహ్రీన్ పై కొత్త వార్తలు పుట్టిస్తున్నాయి.
తన మెస్ బిల్ ఇంత అయింది.. లాండ్రీ బిల్ అంత అయింది.. పర్సనల్ టీమ్ కు చాలా మొత్తం ఇచ్చిది అంటూ ఆ మొత్తం లెక్కలు చెబుతూ అమ్మడిపై బురద జల్లేందుకు వెబ్ సైట్స్ ను వేదిక చేసుకుంటున్నారు. కానీ ఇందులో వాస్తవాలెన్ని అని ఆలోచిస్తే ఖచ్చితంగా సినిమా పోయిన తర్వాత వచ్చిన లాస్ లు కవర్ చేసుకుంటూ నిందలు అవతలి వారిపై వేస్తోన్న వ్వవహారమే తప్ప వేరొకటి కాదని తెలిసిపోతుంది

Related Articles

Back to top button
Send this to a friend