రోగాన్ని కూడా వదలి రాజకీయం.!!

మాటలతో మాయ చేసి ప్రజల ను అయోమయంలో పడేసి వాస్తవాలను కప్పిపుచ్చడం మన రాజకీయ నేతలకు ఓటు తో వచ్చిన విద్య.ఇప్పుడు ఎ.పి లో ఇదే జరుగుతుంది. రోగం తో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే రాజకీయ విమర్శల తో కాలం గడుపుతున్నారు నేతలు.ప్రెస్ మీట్ ల లోనే కాదు ట్విట్టర్ లోనూ తిట్టుకంటున్నారు.చంద్రబాబు పై పూట కో ట్వీట్ చేయకుండా ఉండలేకపోతున్నారు విజయ సాయి రెడ్డి.అదే స్థాయి లో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు.తాజాగా టి.డి.పి.నేత వర్మ రామయ్య” సాయి రెడ్డి పెద్ద ట్విట్టర్ వీరుడని,చెప్పేవన్ని అబద్ధాలే “అని విమర్శించారు. ఎ.పి లో వైరస్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, బాగా కట్టడి చేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించినట్లు బాకా ఊదుతున్నారని నమ్మశక్యంగా లేని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Related Articles

Back to top button