రైతుల మాటున రాజకీయాలు ఇంకెంతకాలం????

రాష్ట్రం లో కరోనా తో పాటు, అకాల వర్షాలు రైతులని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ పరిస్థితుల లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్య ల పై రాజకీయ రగడ నడుస్తుంది.ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వమే దళారి లాగా వ్యవహరిస్తోందని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు గా విమర్శించారు. రెైతులకు మద్దతు ధర విషయం లో కూడా దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరు కు నిరసనగా నిన్న ఒకరోజు నిరాహారదీక్ష కూడా చేపట్టారు. ఐతే కావాలనే బిజెపి అనవసర రాజకీయాలు చేస్తుందని,వారి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని పలువురు టి.ఆర్.యస్ నేతలు హితవు పలికారు.సంజయ్ కి అంత ప్రేమ ఉంటే పసుపు బోర్డు సాధించుకురావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేయగా,గల్లీ లో కాదు ఈ దీక్ష ఢిల్లీ లో చేసి తమ చిత్తశుధ్ది చాటుకోవాలని గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.తన ఉనికి చాటుకునేందుకే ఈ దీక్ష అని పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు.రైతులతో రాజకీయాలు ఇంకెంతకాలం అంటూ మండిపడుతున్నాయి రైతు సంఘాలు.

Related Articles

Back to top button
Send this to a friend