రేవంత్ రెడ్డిపై సోనియా స్పెషల్ కేర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆలస్యంగా అయినా స్పష్టంగా స్పందించి ఆ పార్టీ కేంద్ర కమిటీ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాదు.. ఢిల్లీ నుంచి ఒక లాయర్ల బృందాన్ని కూడా పంపించారు. అలాగే తమ నేతలతో పార్లమెంట్ కమిటీ ప్రెసిడెంట్ కు కూడా ఓ నివేదిక అంద జేశారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఓ చిన్న కేస్ లో తమ ఎమ్.పికి బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.
అయితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి పెద్దగా స్పందన లేదు. ఈ టైమ్ లో సోనియా గాంధీ ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డికే పిసిసి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం ఈ వ్యవహారంతో హాట్ హాట్ గా సాగుతోంది.
కొన్ని రోజుల క్రితం కెటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ ను పర్మిషన్ లేకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారనే కేస్ లో రేవంత్ ను అరెస్ట్ చేశారు. కానీ ఓ చిన్న కేస్ కోసం ఏకంగా వారం రోజుల పాటు ఎమ్.పి స్థాయి వ్యక్తిని జైలుకు పరిమితం చేయడం విడ్డూరంగానే అనిపిస్తోంది. పైగా బెయిల్ కుఅప్లై చేసిన ప్రతిసారి నిరాకరిస్తుంది కోర్ట్. దీని వెనక ఎవరున్నారనేది సామాన్యులు సైతం సులువుగా ఊహించగలరు. అందుకే ఢిల్లీ నుంచి తమ లాయర్లను పంపించింది సోనియా గాంధీ. మొత్తంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పిస్తారు అనేకంటే కూడా అతనికి బెయిల్ ఇప్పించడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.
ఇక ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నవారి జాబితా కాంగ్రెస్ లో భారీగానే ఉంది. మరి తాజా వ్యవహారంపై వారి స్పందన ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికే జగ్గారెడ్డి, వి హనుమంతరావు వంటి వారు అది రేవంత్ రెడ్డి పర్సనల్ గొడవగా చెబుతూ మేటర్ డైల్యూట్ చేస్తున్నారు. ఈ టైమ్ లో ఏకంగా సోనియా గాంధీనే రంగంలోకి దిగింది. అంటే ఇప్పుడు జగ్గారెడ్డి మేటర్ ఏమో కానీ.. మాటిమాటికి ‘సోనియమ్మ’అంటూ చెప్పుకునే విహెచ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend