రేపు మెట్రో రైళ్లూ బంద్

కరోనా కరోనా.. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే పేరు. కనిపించని ఈ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యాలు సైతం ఆ మహమ్మారికి వణికిపోతున్నాయి. ఇప్పటి వరకూ మందు కనిపెట్టలేకపోయినా ఈ వైరస్ నుంచి కాపాడుకోవాడినికి ఒక్కటే మార్గం. దానికి దూరంగా ఉండటం. వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం. సామాజిక దూరం పాటించడం. ఈ క్రమంలో ఇప్పటికే జన సమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలన్నీ మూసివేశారు. ఇక రేపు ప్రధాన మంత్రి మోదీ చెప్పినట్టుగా దేశమంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించబోతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దు. ఆఫీస్ లో ఉండేవాళ్లు ఆఫీస్ లోనే ఉండాలి. ఆ టైమ్ కు ముందు కానీ తర్వాత కానీ ఎవ్వరూ వీధుల్లో కనిపించకూడదు.
ఇక ఈ జనతా కర్ఫ్యూకు మద్ధతుగా ఇప్పటికే అన్ని రాజకీయా పార్టీలూ మద్ధతు నిచ్చాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ తమ అభిమానులకు దాన్ని పాటించాలని సూచనలను చేస్తున్నారు. అలాగే రవాణా వ్యవస్థ కూడా రేపు పూర్తిగా స్తభించబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆర్టీసీ కూడా బంద్. తాజాగా హైదరాబాద్ మెట్రో రైళ్లను కూడా నిలిపివేస్తున్నట్టు మెట్రో ఎమ్.డి ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించాడు. అందువల్ల ఎవరైనా మెట్రోస్ ఉన్నాయి కదా అనుకుంటే వారికి ఇబ్బందులు తప్పవు.

Related Articles

Back to top button
Send this to a friend