రివ్యూ : హిట్


తారాగణం : విశ్వక్ సేన్, రుహానీశర్మ, భానుచందర్, మురళీ శర్మ, శ్రీనాథ్ మాగంటి తదితరులు
సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ : నాని
దర్శకత్వం : డాక్టర్ శైలేష్ కొలను

నేచురల్ స్టార్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న నాని నిర్మాతగా మారాడు అంటే అతని అభిరుచికి తగ్గ సినిమాలే చేస్తాడు అని అంతా భావించారు. అందుకు కారణం తొలి సినిమా. కానీ ఆ సినిమాకు అవార్డ్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు. అందుకేనేమో.. ఈ మధ్య కాలంలో మంచి సెల్లర్ గా భావిస్తోన్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను సెకండ్ మూవీగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది కూడా ఓ కొత్త దర్శకుడితో చేసిన సినిమానే. డాక్టర్ వృత్తి నుంచి దర్శకుడుగా మారిన శైలేష్ కొలనుతో రూపొందించిన ఈ చిత్రానికి విశ్వక్ సేన్ ను హీరోగా ఎంచుకున్నాడు. మొత్తంగా విడుదలకు ముందు మంచి ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. మరి ఎలా ఉందో చూద్దాం..

కథ :
విక్రమ్(విశ్వక్ సేన్).. ‘హోమిసైడ్ ఇంటర్ఫీయరెన్స్ టీమ్’(హిట్) విభాగంలో పోలీస్ గా పనిచేస్తుంటాడు. అతను డిపార్ట్ మెంట్ లో జాయిన్ అయిన కొత్తలోజరిగిన ఓ సంఘటన వల్ల మంటలు చూస్తే బ్యాలన్స్ తప్పుతుంటాడు. చాలా ఇంటిలిజెంట్ గా పేరున్న విక్రమ్.. ఫోరెన్సిక్ విభాగంలో పనిచేసే నేహ(రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. తన అసిస్టెంట్ రోహిత్ తో కలిసి కేస్ లు ఛేదిస్తుంటాడు. అయితే తన మానసిక సమస్య వల్ల నేహ బలవంతంతో కొన్నాళ్లు సెలవు పెడతాడు. అతను సెలవులో ఉన్నప్పుడు ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ కు గురవుతుంది. ఆ కేస్ మరో అధికారి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అదే టైమ్ లో నేహను కూడా ఎవరో కిడ్నాప్ చేస్తారు. దీంతో మళ్లీ డ్యూటీలో జాయిన్ అయిన విక్రమ్ ఆ కిడ్నాపర్ ను పట్టుకున్నాడా..? ఎవరు చేశారు..? కిడ్నాప్ అయిన వాళ్లు బ్రతికి ఉన్నారా లేక చనిపోయారా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ .. ఈ జానర్ లో సాగే అన్ని సినిమాల కథ ఒకేలా లేకపోయినా కథనం మాత్రం అలాగే ఉంటుంది. అంటే కొన్ని హత్యలు లేదా కిడ్నాపులు.. ఎవరు చేస్తున్నారో తెలియక డిపార్ట్ మెంట్ అంతా వెదకడం.. అందులో ఇంటిలిజెంట్ హీరో కావడం.. అతనే అన్ని అంశాలూ పరిశీలించడం.. కొందరిని అనుమానించడం.. ఆనక వాళ్లు కాదని తేలిపోవడం.. అలా లాగుతూ ఆఖర్న ఎవరూ ఊహించని వ్యక్తి నిందుతుడుగా దొరకడం.. ఏ ఉడ్ లో చూసినా.. ఈ జానర్ సినిమాల్లో జరిగేది. అందుకే దీన్నే కాస్త ఇంట్రెస్టింగ్ గా,. ఇంటెన్సివ్ గా రాసుకోవడమే ఇంపార్టెంట్. అయితే ఈ సినిమాలోనూ అలా రాసుకున్నా.. ఎందుకో మరీ అంత థిక్ కనిపించదు స్క్రీన్ ప్లే. అలాగే ఇది సీరియల్ మిస్సింగ్స్ కూడా ఉండవు. సినిమాలోనే ఓ చోట విక్రమ్ పై ఆఫీసర్ పాత్రధారి భానుచందర్ చెప్పినట్టు ఈ కేస్ నీకు ఇస్తే ఇంటిలిజెన్సీ కంటే ఎమోషన్ తో వెళతావు అందుకే వద్దు అంటాడు. నిజానికి సినిమా అంతా కేవలం నేహా కోసం సాగే వేట. మధ్యలో ప్రతీ కేస్ అడ్డుగా ఉంచుకుంటారంతే. మొత్తంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో అనుమానితుల సంఖ్య ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఆఖరి వ్యక్తి లేకపోవడం మైనస్ అయితే .. ఇన్వెస్టిగేషన్ పేరుతో సాగించిన డ్రామా మరీ ఎక్కువైంది. దీంతో రెండు గంటల సినిమానే అయినా చాలా సేపు చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుతుంది.
పోలీస్ పాత్రలో పర్టిక్యులర్ గా ఈ తరహా పాత్రలో విశ్వక్ సేన్ ఆకట్టుకున్నాడు. అతని సరసనే కనిపించిన రోహిత్ పాత్రధారి సింగిల్ ఎక్స్ ప్రెషన్ భలే మెయిన్టేన్ చేశాడు. ఈ విక్రమ్ మరో పోలీస్ తో ఎందుకు తగాదా పడుతుంటాడో అర్థం కాదు. హీరోయిన్ రుహానీ శర్మ పాత్రలో నటనలో ఏ కొత్తదనమూ లేదు. బ్రహ్మాజీ, భానుచందర్, మురళీశర్మలవి రొటీన్ క్యారెక్టర్స్.. మొత్తంగా రెగ్యులర్ గా చూస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది తప్ప. మరీ కొత్తగా అయితే అనిపించదు.

టెక్నికల్ గా వివేక్ సాగర్ సంగీతం మేజర్ హైలెట్. పాటలు బాలేదు కానీ.. నేపథ్య సంగీతం సింప్లీ సూపర్బ్. అలాగే సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. మాటలు ఓకే, ఎడిటింగ్ పరంగా రెండు మూడు ఇన్వెస్టిగేషన్స్ లేపేసినా పెద్దగా ఇబ్బంది లేదు. డైరెక్షన్ ఓకే. స్క్రీన్ ప్లే ఇంకాస్త పకడ్బందీగా రాసుకోవల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
ఆర్టిస్టులు
సినిమాటోగ్రఫీ
నేపథ్య సంగీతం
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
పాటలు
ఇన్వెస్టిగేషన్ సీన్స్

ఫైనల్ గా : హిట్ .. కొట్టకపోవచ్చేమో ..
రేటింగ్ : 2.5/5

Related Articles

Back to top button
Send this to a friend