రామ్ చరణ్ పై అవన్నీ పుకార్లేనట

రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా రూపొందుతోన్న సినిమా ఆచార్య. కొణెదల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముందుగా ఈ పాత్రను మహేష్ తో చేయించాలనుకున్నారు. కానీ మళ్లీ తామిద్దరం కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో అని మెగాస్టార్ మహేష్ కంటే చరణ్ కే ప్రిఫర్ చేశాడు. దీంతో రాజమౌళిని ఒప్పించి చరణ్ ఈ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా గురించి లేటెస్ట్ గా వస్తోన్న రూమర్ ఏంటంటే.. ఈ మూవీ కోసం చరణ్ ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదు. కేవలం తన రెమ్యూనరేషన్ ఇప్పుడు తీసుకోవడం లేదు. కానీ లాభాల్లో మాత్రం సగం వాటా తీసుకుంటాడు అని. కానీ ఇదంతా నిజం కాదని చెబుతున్నాడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత నిరంజన్ రెడ్డి.
ప్రస్తుతం వస్తున్నవన్నీ రూమర్సే అని కొట్టిపడేశాడు. సినిమా ప్రారంభం టైమ్ లోనే తాము అన్నీ చర్చించుకున్నామని చెప్పాడు. ఇందులో చరణ్ ఏం పెట్టుబడి పెట్టడం లేదు అనే మాట అబద్ధం అని తేల్చాడు. ఈ సినిమా విషయంలో అన్నీ సమానంగానే ఉన్నాయని క్లియర్ గా చెబుతున్నాడాయన. అంతేకాక రామ్ చరణ్ 30 కోట్లు డిమాండ్ చేశాడు అనే మాటలోనూ వాస్తవం లేదన్నాడు. అలాగే సినిమా విషయంలో వినిపిస్తున్నవన్నీ రూమర్సే అని మూవీ ఎక్కడా ఆగడం లేదని… షూటింగ్ సజావుగా సాగుతోందని చెప్పాడు. అలాగే అనుకున్న టైమ్ లోనే విడుదల చేస్తాం అని ఖచ్చితంగా చెబుతున్నాడాయన.
అన్నీ బానే ఉన్నాయి కానీ ఇన్ని రూమర్స్ వస్తున్నప్పుడు తామే క్లియర్ చేయకుండా ఆ నిర్మాతతో ఈ మాటలన్నీ చెప్పించడంలోనే ఏదో మతలబు ఉన్నట్టు కనిపించడం లేదూ…?

Related Articles

Back to top button
Send this to a friend