రామ్ చరణ్ తో జెర్సీ డైరెక్టర్ ప్రేమ కథ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రంగ స్థలం తో నటుడుగాను నిరూపించుకున్నాడు.  ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్నాడు. మరో వైపు చిరంజీవి హీరో గ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. రాజమౌళి సినిమా మరో రెండు నెలల్లో పూర్తి అవుతుంది. ఆ తరవాత చేయబోయే సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.రీసెంట్ గా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసాడు అని వినిపించింది. అది ఇప్పటి వరకు తాను టచ్ చేయని సబ్జెక్టు అనీ, అందుకే కొత్తవాడైనా. ఆ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకున్నారు. కానీ లేటెస్ట్ గా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.
మల్లి రావా, జెర్సీ సినిమాలతో టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి తో సినిమా అంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ తన జెర్సీ సినిమానే హిందీ లో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ షూటింగ్ కుడా జరుగుతోందిప్పుడు. ఈ మూవీ తర్వాత చరణ్ తో ప్రాజెక్టు ఓకే కావొచ్చు అంటున్నారు. ఇది సౌత్ అండ్ నార్త్ నేపథ్యం లో సాగే ప్రేమ కథ అనీ చెబుతున్నారు. గతం లో ఓరేంజ్ మూవీ తర్వాత చరణ్ మల్లి పూర్తి స్థాయి ప్రేమ కథ చేయలేదు. అందుకే ఈ కథకు ఓకే చెప్పాడు అనీ వినిపిస్తోంది.
మరోవైపు ఈ కథ చరణ్ వరకు రావడానికి అల్లు అరవింద్ కారణం అనీ కూడా అంటున్నారు. గౌతమ్ జెర్సీ హిందీ రీమేక్ నిర్మాతల్లో అరవింద్ ఒకడు కదా . అతనికి ఈ కథ తెలియగానే చరణ్ కి రిఫర్ చేసాడట. కథ విన్న చరణ్ కు నచ్చింది అంటున్నారు. మొత్తంగా చరణ్ ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరో ఒకరితో నెక్స్ట్ సినిమాకి వెళ్లడం ఖాయం గా కనిపిస్తోంది.

Related Articles

Back to top button
Send this to a friend