రామ్ గోపాల్ వర్మ.. ఇది టూమచ్ గురూ

కాంట్రవర్శీయల్ కింగ్ అంటే ఇండియాలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ఏ విషయాన్నైనా పుల్లలు పెట్టేయడంలో మనోడికి మాస్టర్ డిగ్రీస్ చాలానే ఉణ్నాయి. అయితే గతంలో కెఏ పాల్ పై అనేకసార్లు కాంట్రవర్శీయల్ అండ్ కామెడీ వ్యాఖ్యలు చాలానే చేశాడు. ఎన్నికల తర్వాత ఓడిపోయిన పాల్ అమెరికా వెళ్లిపోయాడు. అయితే ప్రస్తుతం ప్రపంచ మంతా కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పాల్ తనకు సంబంధించిన రెండు భవనాలను ఉచితంగా రెండు ప్రభుత్వాలు వాడుకునేందుకు ఇస్తానని ముందుకు వచ్చాడు. విశాఖ పట్నం సమీపంలోని భవనాన్ని ఏపికి, మహబూబ్ నగర్ దగ్గర ఉన్న భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కరోనా నివారణకు అది సోకిన వారికి ఇస్తానని ప్రకటించాడు. ఇదే విషయాన్ని మరోసారి చెబుతూ కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశాడు.
అయితే ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ దారుణంగా కమెంట్స్ చేశాడు. అతను దేవుడిని నమ్మాడ ఇంకెవడిని నమ్మాడో తన తంటాలేవో తను పడుతున్నాడు పాల్. దీనికి వర్మ అతని సాయాన్ని మరచి అసందర్భంగా నీచమైన కమెంట్స్ చేశాడు వర్మ. నిజమే ఇప్పుడు ఏ దేవుడూ కాపాడలేడు. దేవుడే లేడు అనుకునే వర్మ లాంటి వాళ్లు సెటైర్స్ వేయొచ్చు. కానీ ఇలా ఒక వ్యక్తి చేస్తానన్న సాయం గురించి కాకుండా అతన్ని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం వర్మ మెంటల్ డిజెబిలిటీని సూచిస్తుంది.
పాల్ ను దేవుడుకి చెప్పి వైరస్ పోయేలా చేయమని చెబుతూ అతన్ని అరేయ్ సుబ్బారావ్ అంటూ సంబోధించడం బాలేదు. ఈ ముక్క ఎవరైనా చెబితే దానిపైనా ఇష్టానికి వాగుతాడు వర్మ. ఏదేమైనా అతని నీచ బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నాడు వర్మ.

Related Articles

Back to top button
Send this to a friend