రానా కరోనాకు భయపడటం లేదు

దగ్గుబాటి రానా.. కొన్నాళ్ల అనారోగ్యంతో అన్ని సినిమాలూ వాయిదా వేయించాల్సి వచ్చింది. బాహుబలి తర్వాత చేసిన నేనే రాజు నేనేమంత్రితో మంచి విజయం అందుకున్న రానా ఆ ఊపులో ఏకంగా ఐదారు సినిమాలు కమిట్ అయ్యాడు. వీటిలో హిందీ సినిమాలు కూడా ఉణ్నాయి. తెలుగులో విరాట పర్వం ఉంది. అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమాలు తన హెల్త్ బాలేకపోవడంతో సర్జరీ చేయించుకోవడం వల్ల వచ్చిన గ్యాప్ తోనే ఇంత ఆలస్య అయ్యాయి. మొత్తంగా ఆలస్యం అయినా ఆగకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా అరణ్యం సినిమాను పూర్తి చేశాడు. ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2నే ఆడియన్స్ ముందుకు తెస్తున్నాడు.
మామూలుగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తోచాలా సినిమాలు వాయిదాపడ్డాయి. అలాగే అంతకు ముందే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాలేదని అరణ్యం చిత్రాన్ని ఏప్రిల్ 17కు పోస్ట్ పోన్ చేస్తారు అని వినిపిచింది. ఈ లోగా కరోనా విజ్ృభించడంతో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అరణ్యం ముందు చెప్పిన డేట్ కే వస్తుందని అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఈ మేరకు టీమ్ నుంచి ఓ పోస్టర్ కూడా వదిలారు.
తమిళ్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రానాతో పాటు అక్కడి మీడియం రేంజ్ హీరో విష్ణు విశాల్ కూడా నటించాడు. అతనిదీ కీలకమైన పాత్రే. జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఫీమేల్ లీడ్ చేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర తెలుగుతో పాటు ప్రధానంగా తమిళ్ అలాగే హిందీలో హాథీమేరా సాథీ పేరుతో విడుదలవుతోంది. మొత్తంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కరోనా ప్రభావం తగ్గితే మళ్లీ పెద్ద సినిమాల సందడి మొదలవుతుందన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend