రాజ్ తరుణ్ నిర్మాతగా వరుణ్ తేజ్

ఇండస్ట్రీలో ఏ పరిచయం ఎప్పుడెలా ఉపయోగపడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే ఏ పరిచయం లేకున్నా తెలియకుండానే కొన్నిసార్లు హెల్ప్స్ జరుగుతుంటాయి. అలాంటిదే ఇపుడు రాజ్ తరుణ్ విషయంలో జరగబోతోంది. కొన్నాళ్లుగా సినిమా చేసేదే ఫ్లాప్ అయ్యేందుకు అన్నట్టుగా ఉంది రాజ్ తరుణ్ పరిస్థితి. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా సిట్యుయేషన్ లో మార్పులు లేవు. రీసెంట్ టైమ్ లో మరీ దారుణమైన ఫ్లాపులు వచ్చాయి. దిల్ రాజు వంటి నిర్మాత కూడా రాజ్ తరుణ్ ను కాపాడలేకపోయాడు. ఈ టైమ్ లో అతనికి అనుకోని అండగా వరుణ్ తేజ్ నిలవబోతున్నాడు.
వరుణ్ తేజ్ కజిన్స్ లో ఒకరైన సిధ్దు నిర్మాణ రంగంలోకి దిగుతున్నాడు. అతనితో పాటు అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మాణం చేయబోతున్నాడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ లో తొలి సినిమాగా రాజ్ తరుణ్ తో చేయబోతున్నారు. ఈ మూవీతో మోహన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మరి ఇందులో వరుణ్ తేజ్ హస్తం ఏముందీ అనుకుంటున్నారా..? ఉంది.. ఎలాగంటే ఈ సిద్ధు అనే కుర్రాడు పేరుకు మాత్రమే ఉంటాడట. అతని తరఫున డబ్బులు పెట్టేది వరుణ్ తేజే అంటున్నారు. అంటే తన కజిన్ ను ముందుంచి తను బ్యాక్ ఎండ్ లో ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మరి తను డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు ప్రమోషన్ కూడా చేస్తాడు కదా. అంటే రాజ్ తరుణ్ కు మంచి సపోర్ట్ దొరికినట్టే కదా.. సో.. అలా ఈ ఫ్లాప్ హీరో పాలిట ఆపద్బాంధవుడులా వరుణ్ తేజ్ వస్తున్నాడన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend