రాజ్ తరుణ్ టి చివరి అవకాశం?

కొన్నాళ్ల క్రితం యూత్ ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న కుర్రాడు రాజ్ తరుణ్. కొన్ని విజయాలు అందుకున్నాడు. కానీ కుర్రాడు స్టార్ మెటీరియల్ కాదని అప్పుడే చాలామంది భావించారు. అది నిజమే అంటూ కొన్ని కథలు మోయలేక చతికిల బడ్డాడు. దీనికి తోడు కొన్ని రోజులుగా అసలు హిట్లే లేవు. అతను సినిమా చేయడమే ఆలస్యం.. ఖచ్చితంగా ఫ్లాప్ అన్నట్టుగా మారింది పరిస్థితి. చివరికి దిల్ రాజు ముందుకు వచ్చి సినిమాలు  చేసినా.. మనోడి ఫేట్ మారలేదు. ఈ టైమ్ లో చివరి అవకాశం అనదగ్గ చిత్రంగా వస్తోంది ‘ఒరేయ్ బుజ్జిగా’. తన లక్కీ బ్యూటీ హెబ్బా పటేల్ తో పాటు మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ బానే ఉంది.
నితిన్ తో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాన్ని తీసి సూపర్ హిట్ అందుకున్న కొండా విజయ్ కుమార్ ఈ మూవీకి డైరక్టర్. ఈ సినిమాకు సంబంధించి పెద్ద హోపింగ్ పాయింట్ ఏదైనా ఉంటే దర్శకుడే. ఈ నెల 25న విడుదల కాబోతోందీ చిత్రం. అయితే అదే రోజున నాని నటించిన ‘వి’ కూడా ఉంది. అలాగే యాంకర్ ప్రదీప్ నటించిన ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే మూవీ కూడా రాబోతోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఉన్న పరిస్థితికి ఇది చాలా పెద్ద పోటీ. అయితే ఈ పోటీలో రాజ్ తరుణ్ నిరాశపరచడు అంటోంది పరిశ్రమ. ఇప్పటికే సినిమా చూసిన కొందరు మూవీపై పాజిటివ్ రివ్యూస్ చెబుతున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటున్నారు. ట్రైయాంగిల్ లవ్ అయినా రొటీన్ గా ఉండదట. పైగా హెబ్బా పటేల్ పూర్తి స్థాయి హీరోయిన్ కూడా కాదు. మొత్తంగా రాజ్ తరుణ్ కు హిట్ రాకపోయినా ఫ్లాప్ మాత్రం కాదు అనేది ఈ మూవీ గురంచి వినిపిస్తోన్న టాక్. చూద్దాం.. అంత పోటీలో అతను ఎంత స్కోర్ చేస్తాడో

Related Articles

Back to top button
Send this to a friend