రాజ్ తరుణ్ కి అంత తక్కువా!
రాజ్ తరుణ్ తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ రాజ్ కు నిరాశే మిగిలింది. ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని..రాజ్ ఖాతాలో మరో ప్లాప్ గా చేరింది. కాగా ఈ సినిమాకుగాను రాజ్ తరుణ్ కు దిల్ రాజ్ అతి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హీరోగా రాజ్ తరుణ్ సక్సెస్ అయ్యాక 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న రాజ్ తరుణ్‌కు కేవలం 10 లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చాడట నిర్మాత దిల్ రాజు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను రాజ్ తరుణ్‌తో తీయాలనుకోలేదు. ఈ సినిమాను మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తొలి చిత్రంగా తెరకెక్కించాలని భావించాడు దిల్ రాజు. సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు కూడా. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో అశోక్ స్థానంలో రాజ్ తరుణ్‌ను తీసుకొని సినిమాను రూపొందించాడు.