రాజమౌళిని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్

S.S.Rajamouli

రాజమౌళిని ఇబ్బంది పెట్టే హీరోయిన్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ.. నిజమే.. కానీ అదంతా అతని మిస్టేకే. అందుకే ఇప్పుడు హీరోయిన్ ను బుజ్జగిస్తున్నారట. ఇంతకీ రాజమౌళిని ఇబ్బంది పెట్టేది ఎవరనే కదా డౌట్.. ఇంకెవరూ అలియాభట్.. యస్.. రామ్ చరణ్ సరసన తీసుకున్న అలియా భట్ ఈ మూవీకి డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందట. ఇప్పటికే చివరి షెడ్యూల్ వరకూ వచ్చింది టీమ్. ఇప్పటికైనా తన డేట్స్ ఇస్తే ముందుగా తన పార్ట్ అంతా పూర్తి చేసి పంపిస్తానని చెప్పాడట జక్కన్న. కానీ తను అలాట్ చేసిన డేట్స్ లో రాజమౌళి గతంలో షూట్ చేయలేకపోయాడు. ఈ లోగా తను హిందీలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తోంది. అందువల్ల అవన్నీ క్లాష్ అవుతున్నాయట.
ఓవైపు కరోనా వైరస్ ప్రభావం చూపుతున్నా రాజమౌళి మాత్రం పూణెలో ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ షెడ్యూల్ లోనే అలియా జాయిన్ కావాల్సి ఉంది. కానీ తనిప్పుడు కరోనాను కూడా సాకుగా చూపుతోందట. దీంతో రాజమౌళికి మరింత తలనొప్పిగా తయారైందని టాక్. ఏదేమైనా తను రాకపోతే మరో హీరోయిన్ తో వెళ్తాడా లేదా అనేది చెప్పలేం కానీ.. ప్రస్తుతం అలియాతో కాస్త సీరియస్ గానే డిస్కషన్స్ సాగుతున్నాయని సమాచారం.

Related Articles

Back to top button
Send this to a friend