రష్మిక వళ్లే భీష్మ హిట్ అయింది -నితిన్


ఎట్టకేలకు హిట్ టేస్ట్ చేస్తున్నాడు నితిన్. కొన్నాళ్లుగా మళ్లీ ఫ్లాపుల రూట్ లోకి వెళ్లిపోయిన నితిన్ కు భీష్మతో బ్లాక్ బస్టరే వచ్చింది. నిన్న సోమవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ లో మార్పు లేదు. మరీ భారీగా అని కాదు కానీ మాగ్జిమం థియేటర్స్ అన్నీ నిండిపోయాయి. దీంతో సోమ, మంగళ వారాల్లో వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా రేంజ్ అంచనా వేయాలనుకున్నవాళ్లకు ఈ మండే కలెక్షన్స్ మంచి ఒపీనియన్ ఇచ్చాయి. దీంతో అటు నిర్మాణ సంస్థ సైతం చాలా ఖుషీగా ఉంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందంటున్నారు. మంగళ, బుధవారాల్లోనే సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ కు వస్తుందంటున్నారు.
ఇక ఇప్పుడున్నఅంచనాలను బట్టి ఇది నితిన్ కెరీర్ కు మరో బెస్ట్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ విజయానందాన్ని నితిన్ చాలా ఎగ్జైటింగ్ గా పంచుకుంటున్నాడు. తన కెరీర్ లో వచ్చిన రెండు బెస్ట్ హిట్స్ ను సితార బ్యానర్ లోనే ఉన్నాయని.. అలాగే ఈ మూవీ హిట్ లో మేజర్ కంట్రిబ్యూషన్ రష్మిక మందన్నాదే అంటూ హుందాగా చెబుతూనే.. రష్మిక దర్శకుడు వెంకీ కుడుములకు తొలి హిట్ ఇచ్చింది.. ఇప్పుడు నాకూ హిట్ ఇచ్చింది అంటూ ఛమత్కరించాడు. మొత్తంగా నితిన్.. అల్లు అర్జున్ అన్నట్టుగా డబుల్ జోష్ తో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

Related Articles

Back to top button
Send this to a friend