రఫ్పాడించిన రామ్


రామ్ పోతినేని.. కొన్నాళ్ల క్రితం హిట్ కోసం చకోర పక్షిలా చూశాడు. అయితే అతని కెరీర్ ఎప్పుడూ ఒక హిట్ నాలుగు ఫట్ లు అన్నట్టుగా సాగుతోంది. ఆ ట్రెండ్ కు బ్రేక్ పెట్టేలా కనిపిస్తోంది త్వరలో రాబోతోన్న ‘రెడ్’. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ నటిస్తోన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ తమిళ్ లో పెద్ద విజయం సాధించిన ‘తాడమ్’ అనే చిత్రానికి రీమేక్. అక్కడ అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. అయితే ఇది డ్యూయొల్ రోల్. రామ్ ద్విపాత్రాభినయం చేయడం ఇదే మొదటిసారి. అందుకు తగ్గట్టుగానే తన మేకోవర్ లో మంచి మార్పులు చేసుకున్నాడు. రెండు డిఫరెంట్ లుక్స్ బాగా కుదిరాయి.
థ్రిల్లర్ తరహాలో సాగే ఈ సినిమా ఒకే పోలికలో ఉండే ఇద్దరు యువకుల కథ. ఒకరి వల్ల మరొకరు ఇబ్బంది పడతారు. దాన్నుంచి అవతలి వ్యక్తి ఎలా బయటపడ్డాడు అనే కోణంలో ఆద్యంతం రేసీగా సాగే థ్రిల్లర్. ఇక సినిమాలో నివేదా పేతురాజ్, మాళవికశర్మ హీరోయిన్లుగా నటించారు. అయితే రామ్ ఇస్మార్ట్ శంకర్ విజయంలో అత్యంత కీలక పాత్రో పోషించింది మణిశర్మ సంగీతం. అందుకే రెడ్ సినిమాకు కూడా ఆయన్నే తీసుకున్నాడు. టీజర్ లో వినిపిస్తోన్న ఆర్ఆర్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఇది రామ్ కెరీర్ లో మరో బెస్ట్ హిట్ గా నిలవబోతోందని.

Related Articles

Back to top button
Send this to a friend