రజినీకాంత్.. అప్పుడు పడ్డాడు.. ఇప్పుడు పడేశాడు

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకే ఓ వైబ్రేషన్ ఉందని అందరికీ తెలుసు. కంట్రీ తో పాటు ఇతర దేశాల్లోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ వయసు ఇప్పుడు 70యేళ్లు. కానీ అది కేవలం నంబర్ మాత్రమే అని ఈ మధ్య కాలంలో వస్తోన్న సినిమాలతో నిరూపిస్తున్నాడు రజినీ. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతోన్న ‘ఇన్ టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ప్రోగ్రామ్ లో రజినీకాంత్ పార్టిసిపేట్ చేశాడు. ఇంతకు ముందు ప్రధాని మోడీ ఆ సాహసం చేశాడు. అయితే 70యేళ్ల రజినీ కూడా గతంలో ఈ సాహానికి వెళ్లి కిందపడ్డాడు. కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. అప్పట్లో అంతా ఆయనకు ఈ వయసులో అవసరమా అన్నారు. కానీ లేటెస్ట్ గా ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో వీడియో చూస్తే మాత్రం ‘ఈయనకు అసలు వయసు అవుతోందా’ అనిపించక మానదు. ఆ రేంజ్ లో ఉందీ వీడియో.
ఇక వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ చేస్తూ వాల్డ్ వైడ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్ తో కలిసి రజినీకాంత్ ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇద్దరూ కలిసి అభయారణ్యంలో అనేక ప్రమాదాల మధ్య పెద్దగా రక్షణ చర్యలు లేకుండానే సంచరిస్తారు. ఇందులో భాగంగా కొండలు కోనలు దాటారు. ఎన్నో కాలవల్లో ప్రయాణించారు. కానీ రజినీ వయసుతో పోలిస్తే ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. అయినా సూపర్ స్టార్ సులువుగా వెళ్లి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే అప్పుడు పడ్డా కానీ ఈ వీడియోతో అందరినీ మళ్లీ తన మాయలో పడేశాడు.
`ఇన్ టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్- రజనీకాంత్ వర్సెస్ బేర్ గ్రిల్స్` పేరుతో ప్రసారం కాబోతోన్న ఈ ప్రోగ్రామ్ ఈ నెల 23న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానెల్ లో ప్రసారం కాబోతోంది.

Related Articles

Back to top button
Send this to a friend