మోహన్ బాబుకు ఆ పేరే ఎందుకు పెట్టారు.. ?

టాలెంటెడ్ వెటరన్ స్టార్ మోహన్ బాబు.. కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా తెలుగులో. తెలుగులో అతని చివరి చిత్రం మహానటి. అయితే ఇది చాలా చిన్న పాత్రే. నాటి ఎస్.వి. రంగారావు పాత్రలో కనిపించారు. అయితే తన రేంజ్ కు తగ్గ పాత్రలు రావడం లేదనీ.. అలా ఎవరూ తనకు క్యారెక్టర్స్ రాయడం లేదనేది మోహన్ బాబు అభియోగం. మరి కారణాలేవైనా నిజంగానే అతని రేంజ్ కు తగ్గ పాత్రలు క్రియేట్ చేయడంలో టాలీవుడ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన తమిళ్ లో ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండటం విశేషం. ఇందులో సూర్య హీరోగా నటించిన సూరరై పొట్రు ఒకటి. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రాబోతోంది. తెలుగు మహిళ సుధా కొంగర డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అయితే సినిమా నుంచి లేటెస్ట్ గా మోహన్ బాబు లుక్ ను విడుదల చేశారు.
ఈ లుక్ లో ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్రలో ఆయన ఇంతకు ముందు కనిపించలేదు. అయితే సినిమాలో మోహన్ బాబు పేరు ఆయన అసలు పేరు కావడం విశేషం. యస్.. ఓ బయోపిక్ గా రాబోతోన్న ఈ చిత్రంలో హీరోకు గురువు ‘భక్తవత్సలం నాయుడు’అనే పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈయనే తన శిష్యుడు అంతవాడు కావడంలో కీలక పాత్ర పోషిస్తాడట. మొత్తంగా వచ్చే నెలలో విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి తమిళ్ డబ్బింగ్ కూడా ఈయనే చెప్పాడట. ఏదేమైనా తమ ఒరిజినల్ పేర్లతో సినిమాల్లో కనిపించిన నటులు అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన గౌరవం మోహన్ బాబుకు దక్కింది. మరి ఈ పాత్రకు ఆ పేరు పెట్టడంలో ఇంకేదైనా అంతరం ఉందా అనేది చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend