మోదీ ని ఫాలో కాను అంటున్న ట్రంప్

ట్రంప్ ఏది చేసినా వివాదాస్పదంగానే ఉంటుంది.వివాదాలను వెతుక్కుంటూ వెలతారు  ఆయన.తాజా గా మన ప్రధాని మోదీ తో దోస్తీ కి కటీఫ్ చెప్పేశారు.ట్రంప్ ట్విట్టర్ ఖాతాను వైట్ హౌస్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను,ప్రధాని మోదీ కార్యాలయాన్ని(PMO)ని అన్ ఫాలో చేసింది వైట్ హౌస్.అంతటితో ఆగలేదు,అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా అన్ ఫాలో చేసింది. PMO ట్విట్టర్ ఖాతాను ఫాలో అవడం ఏప్రిల్ 10 నుండే ప్రారంభించింది వైట్ హౌస్.మరి ఇంతలోనే ఏమైందో ఏమో భారత్‌కు చెందిన 3అకౌంట్లను అన్ ఫాలో చేశారు దీనికి సరైన కారణం అమెరికా చెప్పలేదు కానీ,అమెరికా భారత్ ల మధ్య సత్సంబంధాలు కొరవడుతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.

Related Articles

Back to top button