మెగా హీరో కోసం ఉపేంద్రను దించుతున్నారా..?

ఉపేంద్ర.. సౌత్ లోని టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ మేకర్స్ లో ఒకడు. ఉపేంద్ర తన ప్రస్థానాన్ని తనే రాసుకున్న రేర్ పీస్. ఎన్నో సంచలనాలకు అడ్రెస్ అతను. దర్శకుడుగానూ ఎన్నో విషయంలో చాలామంది మేకర్స్ కు ఇన్సిస్పిరేషన్ గా నిలిచాడు. నటుడుగా మారిన తర్వాత మెగా ఫోన్ కు విరామం ఇచ్చాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఉపేంద్ర సినిమాకు సీక్వెల్ చేసి ఫ్లాప్ చూశాడు. ప్రస్తుతం హీరోగానే ఫుల్ బిజీగా ఉన్న ఉపేంద్ర కొన్నాళ్ల క్రితం తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు ఉపేంద్ర ప్రెజెన్స్ చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు. మధ్యలో కొందరు అడిగినా డేట్స్ లేక కొన్ని.. పాత్ర నచ్చక కొన్నీ వదులుకున్నాడు. మొత్తంగా ఇప్పుడు మరోసారి ఉపేంద్ర పేరు తెరపైకి వచ్చింది.
మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రను సంప్రదిస్తున్నారట. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ లా ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు. నవీన్ చంద్ర విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్యాక్ స్ట్రాంగ్ గానే ఉంది. అయితే ఉపేంద్ర ఎంటర్ అయితే సినిమా రేంజ్ కూడా మారుతుంది. ఎందుకంటే ఉప్పీకి తెలుగులోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి అతను ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend