మెగా కుర్రాడు ఫిక్స్ అయినట్టున్నాడు

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న మరో కుర్రాడు వైష్ణవ్ తేజ్. సాయితేజ్ తమ్ముడుగా వస్తోన్న ఈ కుర్రాడి తొలి సినిమా ‘ఉప్పెన’. వైష్ణవ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తమిళ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా కుర్రాడి ఎంట్రీ గ్రాండ్ గానే ఉండబోతోందని చెప్పాలి. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో అది సాధ్యం అయ్యేలా లేదు. పైగా కొత్త కుర్రాడు కదా.. కాస్త ‘మెగా బూస్టింగ్’కూడా అవసరం. అందుకు అంతా ఖాళీగా లేరు. అందుకే కాస్త టైమ్ తీసుకుని మే నెలలో రావాలనుకుంటున్నారు.
మే 7న ఉప్పెన విడుదల చేయబోతున్నట్టు టీమ్ అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతం అన్ని సినిమాల విడుదల తేదీల్లో పెద్ద మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో భాగంగానే చాలా మూవీస్ వాయిదా పడుతున్నాయి. అందుకే కాస్త ముందుగానే తమ సినిమా డేట్ ను అనౌన్స్ చేసి త్వరపడ్డారు అనే చెప్పాలి. మరి మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న ఈకుర్రాడి ఫ్యూచర్ ఈ ఉప్పెనతో తేలిపోతుందనుకోవచ్చా..?

Related Articles

Back to top button
Send this to a friend