మెగాస్టార్ విలన్ స్ట్రాంగ్ గానే ఉన్నాడు

సోనూసూద్.. కొన్నాళ్ల క్రితం తెలుగులో ప్రతి స్టార్ హీరో సినిమాలోనూ కనిపించిన విలన్. విలన్ అనగానే అతనే కనిపించాడు ఓ దశలో. ముఖేష్ రుషి తర్వాత కొంత వరకూ పరభాష నుంచి స్టార్ విలన్ హోదా అనుభవించాడు. అదే టైమ్ లో అతనిలోని మంచి నటుడుని పూరీ జగన్నాథ్ వంటి నటులు వాడుకున్నారు కూడా. కాకపోతే కొన్నాళ్లుగా అతను చేయగలిగిన రొటీన్ మాస్ సినిమాలు మన తెలుగులో రావడం లేదు. దీంతో అనివార్యంగానే సోనూసూద్ టాలీవుడ్ కు దూరం కావాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో సౌత్ లోని ఇతర భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు సోనూసూద్. అయితే కాస్త లేట్ అయినా తెలుగులో మరో బంపర్ ఆఫర్ పట్టేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమాలో సోనూనే విలన్ గా తీసుకున్నారు. కొరటాల సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇక మెగాస్టార్ కు ఢీ కొట్టాలంటే ఇంకాస్త బలంగానే ఉండాలి. అందుకే సోనూసూద్ ను తీసుకున్నారు అంటున్నారు. ఈ విషయాన్ని అతనే ట్వీట్ చేశాడు. దీంతో మేటర్ తెలిసిపోయింది. విశేషం ఏంటంటే.. సోనూసూద్.. చిరంజీవి సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. అందుకే కాస్త భావోద్వేగంగానే ట్వీట్ చేశాడు.

Related Articles

Back to top button
Send this to a friend