మెగాస్టార్ కు నో చెప్పింది మాస్ రాజాతో ఎస్ అంది

త్రిష.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య నుంచి తప్పుకుంది. ఇందులో తనకు ముందుగా చెప్పినట్టుగా కాక కథలో చాలా మార్పులు చేశారని.. రామ్ చరణ్ కు కూడా హీరోయిన్ ను పెట్టారని.. ఆకారణంగా తన పోర్షన్ ను తగ్గించారనే కారణాలు చెప్పి ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయింది. దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అయినా డోంట్ కేర్ అనేసిందీ బ్యూటీ. అయితే అనూహ్యంగా ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజ సరసన ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకుని మెగా ఫ్యాన్స్ కు మండేలా చేసింది. వాళ్లకు మండినా ఈవిడకేం కాదుకోండి. కానీ తను ఏ కంటెంట్ ను ప్రిఫర్ చేస్తుందో కూడా తెలియాలి కదా.
చేస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నా.. వరుసగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ లోనే విడుదల కాబోతోంది. దీని తర్వాత రమేష్ వర్మతో సినిమా చేయబోతన్నాడు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వీర అనే ఫ్లాప్ కూడా వచ్చింది. కానీ రమేష్ వర్మ రీసెంట్ గా రాక్షసుడుతో మంచి విజయం అందుకున్నాడు. అందుకే ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ గతంలోనే అనౌన్స్ అయింది. అప్పటి నుంచే రమేష్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్నాడు. ఇందులో భాగంగా హీరోయిన్ త్రిషకు కథ చెప్పి ఒప్పించాడు. ఆచార్య పోయినా మాస్ రాజాకు ఓకే చెప్పి త్రిష చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఇక త్రిష, రవితేజ కలిసి గతంలో వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘కృష్ణ’సినిమాలో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. వీరి కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత మరోసారి మాస్ రాజాతో రొమాన్స్ కు ఓకే చెప్పింది త్రిష.

Related Articles

Back to top button
Send this to a friend