ముఖ్యమంత్రిని తయారు చేస్తా – రజినీకాంత్

‘ముఖ్యమంత్రిని తయారు చేస్తా..’అంటున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.. తయారు చేయడానికి ముఖ్యమంత్రేమైనా చపాతినా పరోటానా అనుకోకండి.. ఆయన చెప్పింది తన పార్టీ కోణం నుంచి. కొన్నాళ్ల క్రితం నుంచి ఆయన రాజకీయాల్లో కాస్త చురుగ్గా ఉంటున్నారు.  అతి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటింబోతున్నారు. ప్రస్తుతం తన రాజకీయ కార్యకాలాపాలన్నీ ‘రజినీ మక్కల్ మండ్రం’అనే అభిమాన సంఘం తరఫు నుంచి నెరపుతున్నారు.ఇక కొన్ని రోజుల క్రితం ఈ ఫ్యాన్ క్లబ్ తో మీటయ్యాడు. అప్పటి నుంచి రకరకాల కథనాలు వస్తున్నాయి. దీంతో వాటిని క్లారిఫై చేయడానికి మరో మీటింగ్ ఎరేంజ్ చేశాడు.
ఈ సందర్భంగా రజినీకాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘డిఎమ్.కె, ఏఐఏడిఎమ్. కె వంటి పార్టీలను ఢీ కొట్టడం అంత సులువు కాదన్నాడు. కాకపోతే దిగ్గజ నాయకులైన జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందన్నాడు. ఈ టైమ్ లో తమ పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటుందని చెబుతూ వ్యవస్థను బాగు చేయాలంటే అందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చాడు.
ఇదే క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు సూపర్ స్టార్. పార్టీని స్థాపించి గెలిచిన తర్వాత తను ముఖ్యమంత్రి సీట్ పై కూర్చోనని తేల్చి చెప్పాడు. బాగా చదువుకున్న, తెలివైన వ్యక్తిని సిఎమ్ గా కూర్చోబెడతానన్నాడు. తన వయసును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తను అంత పెద్ద బాధ్యత మోయడం కరెక్ట్ కాని చెప్పాడు. అలాగే తమ పార్టీలో 60శాతం కేవలం యువకులకే పెద్ద పీట వేస్తామని ప్రకటించాడు రజినీకాంత్.
మొత్తంగా కథ లేదు కథనం తెలియదు సినిమా పేరు ఫలానా అన్నట్టుగా ఉంది రజినీ వ్యవహారం. ఇప్పటి వరకూ పార్టీని ధైర్యంగా ప్రకటించడానికే ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఏకంగా సిఎమ్ వరకూ వెళ్లిపోయాడు. అవున్లే.. పైన బిజెపి ఉంటే కింద రజినీకి వచ్చిన ఇబ్బందేవుందీ..

Related Articles

Back to top button
Send this to a friend