ముంబై పోలీసులకు రోహిత్ రిటర్న్ గిఫ్ట్..

రోహిత్ శెట్టి చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి హిట్ సినిమాలు తీసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్.లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన రోజు వారి కార్మికుల కోసం FWICE కి 51లక్షలు విరాళంగా ఇచ్చారు.తాజా గా లాక్ డౌన్ అమలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముంబై పోలీసుల కోసం ముందు కు వచ్చాడు. ఏకంగా 8 హోటల్ల లో వారికి భోజనం ఇంకా వసతి కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేెసి తన మంచి మనసు ను మరో సారి చాటుకున్నాడు రోహిత్ .స్వయంగా ముంబై పోలీసులే తమ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు. రోహిత్ సింగమ్,సింగమ్ రిటర్న్ లాంటి పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు తీసి బారీ హిట్స్ కొట్టాడు.పోలీసుల మీద సినిమాలు తీయడమే కాదు వారికి అండగా నిలబడతానని నిరూపించాడు రోహిత్ శెట్టి.ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏ కాదు బాలీవుడ్ అంతా రోహిత్ ను ఇప్పుడు అభినందనల తో ముంచెత్తుతోంది.

Related Articles

Back to top button
Send this to a friend