మీరు చెప్పరు.. లీకులు ఒప్పరు అంటే ఎట్టా జక్కన్నా


ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ను రాజమౌళి రేంజ్ లో ఇరిటేట్ చేసిన దర్శకులు ఈ మధ్య కాలంలో ఎవరూ లేరేమో. ఏ టైమ్ లో మొదలుపెట్టాడో కానీ ఆర్ఆర్ఆర్.. అనౌన్స్ అయినప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదనేది నిజం. అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసు. ఆరంభంలోనే అనేక ఇబ్బందులు వచ్చాయి. ఇద్దరు హీరోలకు యాక్సిడెంట్స్ కావడం.. షెడ్యూల్స్ ఆలస్యం కావడం.. హీరోయిన్ల సమస్య.. వాతావరణ ప్రతికూలతలు.. ఇలా ఆ వారస హీరో ఎదగకపోవడానికి వంద కారణాలు అన్నట్టుగా ఈ సినిమా విషయంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ యేడాదిన్నరగా వెండితెరపై కనిపిచడం లేదు. ఇటు రామ్ చరణ్ కూడా డిజాస్టర్ తో ఉన్నాడు. అందుకే ఈ మూవీలో ఆ ఇద్దరూ ఎలాంటి గెటప్పుల్లో ఉంటారు.. ఆ గెటప్పుల్లో వాళ్లు ఎలా ఉంటారు అని తెలుసుకోవలనే కోరిక ఫ్యాన్స్ లో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వచ్చిన అనేక పండగలు, బర్త్ డేలను పూర్తిగా మిస్ చేశాడు రాజమౌళి. దీంతో అభిమానులంతా జక్కన్నపై కోపంగానూ… లీకుల రాజాలపై ఇష్టంగా ఉంటున్నారు.
యస్ ఈ మూవీకి సంబంధించి లీకుల ద్వారా తప్ప హీరోల గురించి ఏం తెలియదు. అయితే ఆ లీక్ లు ఇస్తోన్నవారిపై రాజమౌళి గుస్సా అవుతున్నాడట. ఇది ఫ్యాన్స్ కు ఇంకా కోపం వచ్చేలా చేస్తోంది. అసలు కనీసం తమ హీరోలను ఏం చూపించకుండా ఇలా దాచేస్తూ ఏదో వస్తోన్న లీకులు  చూసి సంతోష పడుతుంటే ఈయనేంటీ ఇలా గుస్సా అవుతున్నాడనుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల ఉగాది సందర్భంగా సినిమా నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. లేదంటే రామ్ చరణ్ బర్త్ డే ఈ నెల 27న అయినా ఏదో ఒక అప్డేట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ సారీ రాలేదంటే ఇక రాజమౌళిని మీమ్స్ తో ఆడేసుకుంటారేమో.

Related Articles

Back to top button
Send this to a friend