మిస్ యూ హలీమ్ అంటున్న హైదరాబాదీలు..

రంజాన్ నెల ప్రారంభం కాబోతోంది. ఉపవాస దీక్ష లు చేసేందుకు ముస్లింలు అంతా సిద్ధం అవుతున్నారు.కరోనా వల్ల ఈసారి ఇఫ్తార్ విందులకు అనుమతి లేదు.సామూహిక ప్రార్థనల కు కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.వీటితోపాటు ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది.అదే హలీమ్ అమ్మకాలపై నిషేధం. మన రాష్ట్రం లో రంజాన్ నెలలో హలీమ్ వ్యాపారం కోట్ల లో జరుగుతుంది.. కేవలం ముస్లిం లే కాదు అన్ని మతాల వారు హలీమ్ ని ఎంతో ఇష్టం గా తింటారు.ప్రతి ఏడాది నగరంలో దాదాపు గా 5వేల కి పైగా హోటల్స్ లో హలీమ్ అమ్మకాలు జోరుగా సాగుతాయి.కానీ కరోనా కారణంగా హలీమ్ తినే అవకాశం ఈ ఏడాదికి లేనట్లే.హలీమ్ మేకర్స్ అసోసియేషన్ ఇప్పటికే దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది. హలీమ్ కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం అని అందుకే ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని అంటున్నారు హలీమ్ వ్యాపారులు..కానీ ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే హలీమ్ ను మిస్ అవుతున్నందుకు హలీమ్ ప్రియులు మాత్రం నిరుత్సాహపడుతున్నారు…

Related Articles

Back to top button
Send this to a friend