మాస్ రాజా కూడా తగ్గడం లేదుగా..


మాస్ మహరాజ్ రవితేజ మరో సినిమా ఒప్పుకున్నాడు. అది కూడా ఫస్ట్ మూవీతోనే డిజాస్టర్ అందుకున్న దర్శకుడు వంశీ వక్కంతంతో. రచయితగా తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేసిన వక్కంతం వంశీకి, రవితేజకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ కారణంగానే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అయిందని వినిపిస్తున్నా.. వంశీ కూడా ఈ సారి తొలి సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా మంచి కథ రాసుకున్నాడంటున్నారు. ఆ కథ నచ్చడం వల్లే రవితేజ ఛాన్స్ ఇచ్చాడనేది అతని వెర్షన్.
వక్కంతం వంశీ ఫస్ట్ మూవీగా అల్లు అర్జున్ ను ఒప్పించాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. అప్పటి నుంచి రెండేళ్లుగా ఖాళీగా ఉంటోన్న వంశీ మళ్లీ దర్శకత్వంపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు.
మరోవైపు రవితేజకు వరుసగా డిజాస్టర్స్ వస్తున్నా.. స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ సమ్మర్ లో వస్తుంది. ఆ తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఇప్పుడు వక్కంతం వంశీతో. మొత్తంగా రవితేజ కూడా ఎక్కడా తగ్గడం లేదు. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు. కానీ రిజల్ట్ మారడం లేదు. కాస్త ఆ కథలపై కూడా కాన్సెంట్రేట్ చేస్తే ఇంకాస్త మంచి సినిమాలు వస్తాయి కదా..

Related Articles

Back to top button
Send this to a friend