మార్చి 2 న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ సింగిల్ విడుద‌ల‌

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్

ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి మెద‌టి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. మార్చి 2న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ సింగిల్ ని విడుద‌ల చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతలు బ‌న్నివాసు, వాసు వ‌ర్మ తెలిపారు. ఇటీవ‌లే అఖిల్, పూజా హెగ్ధేల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ ట్రెండ్ అవ్వ‌డం విశేషం. ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్ ప‌రిశ‌ర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హగ్ధేలు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు ఇండ‌స్ట్రీకి వ‌రుస‌పెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతుండ‌టంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రేక్ష‌కుల ఎక్స్ పెట్టేష‌న్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా రిచ్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా నిర్మాత‌లు బ‌న్నివాసు, వాసు వ‌ర్మ‌లు తెలిపారు.

Related Articles

Back to top button
Send this to a friend