మార్చి 2 నుండి కిర‌ణ్, ప్రియాంక ల చిత్రం షూటింగ్ ప్రారంభం


త‌న‌దైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో న‌టించి మెప్పించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా త‌న రెండ‌వ చిత్రం ఎలైట్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటంగ్ ని మార్చి 2 నుండి ప్రారంభిస్తున్నారు. టాక్సీవాలా లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించి యువ‌త మ‌న‌సులు గెలుచుకున్న ప్రియాంక జవాల్కర్ కిర‌ణ్ కి జోడిగా న‌టిస్తుంది. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 మ్యూజిక్ ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీధ‌ర్ గ‌డె ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అతి ముఖ్య‌మైన పాత్ర లో సాయికుమార్ న‌టిస్తున్నారు. రాజావారి రాణిగారు  చిత్రం ద్వారా ప‌రిచ‌య‌మైన కిర‌ణ్ ప‌ల్లెటూరి ప్రేమికుడిగా క‌నిపించాడు. ఇప్ప‌డు ఈ చిత్రం కొసం త‌న‌ని తాను మ‌రో కొత్త కొణం లో చూపించ‌టానికి స్టైలింగ్ మార్చుకున్నాడు. ఈ చిత్రం అంద‌రిని అల‌రించేలా వుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు..

Related Articles

Back to top button
Send this to a friend