మారుతీ రావు పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతోంది?

మారుతీ రావు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన మారుతీరావు రెండేళ్లుగా మీడియాలో రకరకాలుగా నానుతూనే ఉన్నాడు. అందుకు కారణం గతంలో తన కూతురు అమృత తన కులం వాడిని పెళ్లి చేసుకుంది అనే కారణంతో మిర్యాలగూడ కు చెందిన పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ ను కిరాయి గుండాల చేత హత్య చేయించాడు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్నాడు మారుతీ రావు. ఆరు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించిన తర్వాత బెయిల్ పై విడుదల ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కూడా తన కూతురు అమృత పై కేసు వాపసు తీసుకోవాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడికి గురి చేశాడు. అంతేగాక ఆమె ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని తన తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని అమృత మరోసారి కేసు వేసింది. దీంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి మారుతీ రావు పై పిడియాక్ట్ నమోదు చేశారు. రీసెంట్ గా ఆ కేసును కూడా బెయిల్పై వచ్చి మారుతీరావు అప్పటినుంచి ముభావంగా ఉంటూ ఎవరితోనూ కలవడం లేదు అంటున్నారు. బి ఈ క్రమంలో రీసెంట్ గా అతని ప్రాపర్టీ కి చెందిన ఓ ఇంట్లో ఒక హత్య జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు పోలీసులు తేల్చలేక పోయారు. మరోవైపు మారుతి రావు సామాజికంగా అనేక చీత్కారాలు ఎదురవుతున్నాయి. అతని వల్ల తమ కుటుంబం పరువు పూర్తిగా పోయింది అని తమ్ముడు తో సహా ఇతర బంధువులంతా అతన్ని దూరం పెట్టారట. ఇక ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి మారుతిరావు ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది అని రీసెంట్ గా తేలిపోయింది. అప్పటి నుంచి మరింత కుంగిపోయిన మారుతీ రావు తాజాగా హైదరాబాద్లోని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పడడం మరింత సంచలనం సృష్టించింది.
ఇక ఈ కేసులో మొదటి కొన్ని అనుమానాలు నా పోస్టు మార్టం నివేదిక తర్వాత ఇది పూర్తిగా ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. ఆర్య వైశ్య భవన్ లో రూమ్ తీసుకున్న తర్వాత మారుతీ రావు బయటకు వెళ్ళి తినడానికి గారెలు తెచ్చుకున్న డు. వాటిలోని విషం కలిపి తినేసాడు. దీంతో ఆ విషయం శరీరమంతా పాకి అవయవాలన్నీ చచ్చుబడిపోయి మొదటగా బ్రెయిన్డెడ్ అయ్యింది. తన స్పృహ కోల్పోయిన తర్వాత హార్ట్ ఎటాక్ కూడా రావడంతో అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. శరీరం అంతా విషం పాకడంతో శరీరం రంగు కూడా మారిపోయింది. ఇక మరిన్ని వైద్య పరీక్షల అనంతరం అతను ఏ తరహా విషం తీసుకున్నాడు. ఎక్కడ కొన్నాడు వంటి అంశాలు తేలనున్నాయి. మొత్తం కేవలం డబ్బు కులం సామాజిక అంతరాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య మరో ఆత్మహత్య ఆ రెండు కుటుంబాల్లో ఆరని చిచ్చు రగిల్చింది. మరి ఈ చర్యల ద్వారా మారుతీరావు ఏం సాధించాడు అంటే సమాధానం.. ఎవరికి వారు ఊహించుకో వలసిందే.

Related Articles

Back to top button
Send this to a friend