మానవత్వం తో బ్రతుకుదాం…కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా పై పోరు లో తన కలానికి,గళానికి పదును పెట్టారు.ఆపద సమయం లో మనిషి కి కావలసింది వివేకం, ప్రేమ అంటూ సాగే సాహిత్యాన్ని కమల్ రాయగా దీనికి జిబ్రన్ మ్యూజిక్ అందించారు.కమల్ తో పాటు గా జిబ్రన్,శృతి హాసన్,శంకర్ మహదేవన్, బాంబే జయశ్రీ,యువన్ శంకర్ రాజా,అనిరుధ్,ఆండ్రియా,సిద్దార్థ్, సిడ్ శ్రీ రామ్ సహా 29 మంది ప్రముఖ సింగర్స్ తమ గొంతు కలిపారు.మనిషి కి మనిషి సహాయం, సాటి మనిషి పై ప్రేమ ఇవే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని,కరోనా తరువాత కూడా మనిషి కి ఈ గుణాలు అవసరమని,మానవత్వం మనిషి ని బ్రతికిస్తుందనే సందేశాన్ని ఈ పాట ద్వారా అందించారు .వలస కూలీల కష్టాలు,వెైద్య సిబ్బంది నిరంతర శ్రమ ని విజువల్స్ లో చూపించారు.జూమ్ ఆప్ ద్వారా విడుదలైన ఈ పాట కి మంచి స్పందన వస్తోంది.ఇప్పటికి ఐతే తమిళ భాష లో రిలీజ్ చేశారు కానీ త్వరలో నే మిగతా భాషలలో కూడా చేసేందుకు రెడీ అవుతుంది జిబ్రన్ అండ్‌ టీం.

Related Articles

Back to top button
Send this to a friend