మహేష్ బాబు- పరశురాం కీ హ్యాండ్ ఇచ్చాడా..?

సరిలేరు నీకెవ్వరు సినిమా కమర్షియల్ గా హిట్ అయిన…. కంటెంట్ పరంగా మిశ్రమ స్పందన అందుకుంది. మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి గుడ్డిగా నమ్మాడు అనే విమర్శలు వచ్చాయి. కొండ మెట్ల రావడం పెద్ద గా పోటీ లేకపోవడం వల్ల సినిమా కమర్షియల్ గా విజయం సాధించింది కానీ.. ఆ కథకు అంత సీన్ లేదని అంతా ఒప్పుకునే నిజం. ఆ సినిమా టైంలోనే వంశీ పైడిపల్లి తో మూవీ గురించి మాట్లాడాడు మహేష్ బాబు. కట్ చేస్తే నిర్మాత దిల్ రాజు తో వచ్చిన ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో దర్శకుడు కూడా ఏం చేయాలో తెలియక కామ్ గా ఉండి పోతున్నాడు. అయితే మహేష్ బాబు మాత్రం ఆ డేట్స్ ను ప్రెస్టీజియస్ గా తీసుకొని వెంటనే పరశురాం తో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఆల్రెడీ పరశురామ్ నాగచైతన్యతో ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఆ విషయాలు మాట్లాడుకుని పరశురాముని మహేష్ బాబు తోనే సినిమా చేసేలా ఒప్పించారు నిర్మాతలు.
అయితే ఈ కథ ఎక్కడి వరకు వచ్చింది పరశురాం ఇప్పుడు నిజంగానే మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నాడా మహేష్ బాబు మరో దర్శకుడు కోసం చూస్తున్నాడు అనే ప్రశ్నలు ఫిల్మ్ సర్కిల్స్ లో అలాగే ఉండిపోతున్నాయి. ఎందుకంటే మహేష్‌బాబు హడావుడిగా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. మహేష్ బాబు పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. దర్శకుడు నుంచి ఏ సమాచారం లేదు. అటు నిర్మాణ సంస్థ సైతం ఈ విషయాన్ని క్లారిఫై చేయడం లేదు. దీంతో మహేష్ బాబు, పరశురాం సినిమా కూడా హోల్డ్ లో పడింది అనే టాక్ వినిపిస్తోంది.
మరికొందరు మహేష్‌బాబు పరశురామ్ కి కూడా హ్యాండ్ ఇచ్చాడు అనే మాటలు చెబుతున్నారు. ఇందులో నిజమెంత అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ఇలా ఎవరికి వారు సైలెంట్‌గా ఉండి పోతే.. కొత్త కొత్త రూమర్లు ఇలానే హల్చల్ చేస్తున్నాయి. నిజానికి మహేష్ బాబు కు పరశురామ్ గతంలోనే కథ చెప్పాడు.. అప్పుడు నచ్చని కథ ఇప్పుడు సడన్ గా ఎందుకు నచ్చుతుంది.. ,? మళ్లీ కొత్త కథ కావాలి అంటే ఇంత షార్ట్ టైంలో ఎలా రెడీ అవుతుంది..? ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి కదా.. మొత్తంగా మహేష్ బాబు మౌనం వెనుక మరో వ్యూహం ఏదైనా ఉందా.. ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఖచ్చితమైన క్లారిటీ ఎవరో ఒకరు ఇస్తే కానీ ఇది నిజం అని తెలియదు.

Related Articles

Back to top button
Send this to a friend