మహేష్ బాబు తప్పు చేశాడా..?

మహేష్ బాబు తప్పు చేశాడా.. ? అంటే అవుననే అనుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడు. కానీ కేవలం నిర్మాతతో వచ్చిన విభేదాల వల్లే ఆ ప్రాజెక్ట్ ను ఆపేశాడు. మొదట్లో దీనికి కారణం వంశీ చెప్పిన కథ నచ్చకపోవడమే అనిపించినా.. అసలు నిజం తెలిసిన తర్వాత మహేష్ బాబు రెమ్యూనరేషన్ విషయంలో పట్టుబట్టడం వల్లే ఆ మూవీ ఆగిపోయిందని తేలిపోయింది. ఆ సినిమా ఆగిన వెంటనే పరశురామ్ తో సినిమా అన్నాడు. నిజానికి పరశురామ్ తను చేసిన గీత గోవిందం తర్వాతే మహేష్ న కలిసి కథ చెప్పాడు. అప్పుడు చాలా మార్పులు చెప్పాడు. కానీ ఇప్పుడు అతనే దిక్కయ్యాడు. కారణం.. వేరే ఏ పెద్ద దర్శకులు కూడా మహేష్ తో సినిమా చేసేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. కట్ చేస్తే ఆ సినిమా గురించిన ఊసే లేదిప్పుడు.
మామూలుగా పరశురామ్ ఆల్రెడీ నాగచైతన్యతో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా పరశురామ్ ను రిలీవ్ చేశారు. బట్.. కథే తేలడం లేదు. ఆ కథపై పరశురామ్ కసరత్తులు చేస్తున్నాడు. కాకపోతే అవేవీ ఓ కొలిక్కి రావడం లేదట. దీంతో మహేష్ బాబు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ తను కొంత రెమ్యూనరేషన్ విషయంలో పట్టు విడుపులు చూపించి ఉంటే వంశీ పైడిపల్లితో దిల్ రాజు నిర్మాణంల సినిమా ఆల్రెడీ మొదలై ఉండేది. ఏదేమైనా కేవలం మనీ మేటర్ లోనే సినిమాను వదులుకోవడంతో మహేష్ బాబు తప్పు చేశాడా అని చర్చించుకుంటున్నారు ఫిల్మ్ నగర్ లో.

Related Articles

Back to top button
Send this to a friend