మహేష్ బాబు కొత్త వ్యాపారం సువాసనలు వెదజల్లుతుందట

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తెలుగులో తన స్థాయిలో ఇమేజ్ ను డబ్బు చేసుకునే హీరో మరొకరు లేరు. హీరోగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే కమర్షియల్ యాడ్స్ లో కూడా మహేష్ కు సాటి వచ్చే స్టార్ సౌత్ లో మరొకరు లేరు. మనీ వస్తుందంటే చాలు ఏ యాడ్ కైనా ఓకే చెప్పేస్తాడు మహేష్ పై కొన్ని సెటైర్స్ కూడా ఉణ్నాయి. అయినా అతనికి ఇమేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు. అతను చేస్తున్నాడు. అందులో తప్పేమీ లేదు.
ఇవి కాక కొన్నాళ్ల క్రితం నిర్మాణ సంస్థ కూడా మొదలుపెట్టాడు మహేష్ బాబు. ఎమ్.బి ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి తను చేసే ప్రతి సినిమాలోనూ ఈ ప్రొడక్షన్ ను భాగస్వామిగా చేస్తున్నాడు. దీంతో పాటు థియేటర్స్ వ్యాపారంలో కూడా తిరుగులేకుండా రాణిస్తున్నాడు. ఏఎమ్.బి మాల్స్ పేరుతో రూపొందే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎమ్.బి పేరుపై ఇప్పుడు మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు మహేష్ బాబు. అదే పర్ఫ్యూమ్స్ . ఎస్ సువాసనల వ్యాపారంలోకి ప్రవేశించాడు మహేష్ బాబు. ప్రధానంగా మగవాళ్ల కోసం ఉద్దేశించిన ఈ పర్ఫ్యూమ్స్ ను రకరకాల సువాసనల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఏదైనా మహేష్ లోని బిజినెస్ మైండ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

Back to top button
Send this to a friend