మహేష్ బాబుకు నో చెప్పిన అనిల్ రావిపూడి

సాధారణ కథలతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ ట్రిక్ తోనే మహేష్ బాబుతో ఆఫర్ పట్టేశాడు. సరిలేరు నీకెవ్వరు అంటూ వీరి కాంబోలో వచ్చిన సినిమా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఈ సినిమాతో మరోసారి అనిల్ రావిపూడి తన కంటెంట్ లేమిని చూపించుకున్నాడు. అనిల్ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ లేదా సెకండ్ హాఫ్ పూర్తిగా మైనస్ అవుతుంటాయి. అయినా సరిలేరు పండగ టైమ్ లో వచ్చింది కాబట్టి హిట్టెక్కింది. మొత్తంగా ఇప్పుడు మహేష్ బాబుకు పెద్ద దర్శకులు లేరు. అందుకే పరశురామ్ తో ‘అడ్జెస్ట్’అవుతున్నాడు. ఈ టైమ్ లో అనిల్ రావిపూడి తన కొత్త సినిమా కథ రాసుకుంటున్నాడు.
అనిల్ సరిలేరు నీకెవ్వరు చేస్తున్న టైమ్ లోనే తన నెక్ట్స్ మూవీ ఎఫ్ -2కు సీక్వెల్ అని చెప్పాడు. అంటే ఈ సారి ఎఫ్ -3 తీస్తాడన్నమాట. దిల్ రాజు నిర్మించబోతోన్న ఈ మూవీకే కథ రెడీ చేసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా మహేష్ బాబు అనిల్ ను పిలిచి షార్ట్ టైమ్ లో ఫినిష్ అయ్యేలా ఓ కథ రాయమని చెప్పాడట. అలాంటిది ఉంటే పరశురామ్ కంటే ముందే ఈ సినిమా చేద్దాం అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడట. కానీ అందుకు అనిల్ రావిపూడి నో అని చెప్పినట్టు సమాచారం. అయితే మహేష్ బాబు కూడా గతంలోనే తను మరోసారి అనిల్ తో సినిమా చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. అందులో భాగంగా ఈ ఆఫర్ ఇచ్చాడని కూడా అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు అతని చేతిలో దర్శకులు లేరు. ఇంత త్వరగా అతనికి ఆఫర్ ఇవ్వడానికి అదీ ఓ రీజన్.
ఇలా హీరోలు చెప్పారు కదా అని దాన్ని టార్గెట్ చేసుకుని కథలు రాసుకుంటే కంటెంట్ బావుండదని.. ఏదో మమ అనిపించినా ఆడియన్స్ ముందు దొరికిపోతామని చెప్పాడట. మొత్తంగా అనిల్ రావిపూడి చెప్పింది కూడా మహేష్ కు కరెక్టే అనిపించింది సరే అన్నాడని టాక్. ఏదేమైనా మహేష్ బాబు ఆఫర్ ను కాదన్నాడంటే అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఎఫ్ -3 పై గట్టి ఫోకస్ పెట్టాడనుకోవచ్చు. లేదా అటు దిల్ రాజు తో ఇబ్బందులు వస్తాయనే భయంతో కూడా కావొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend