మహాసముద్రం లో సాయి పల్లవి??

అజయ్ భూపతి, ఈ పేరు మర్చిపోయినా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా మాత్రం చాలా మంది మర్చిపోరు.ముఖ్యం గా యువత అదే Rx 100. తొలి సినిమా తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాడు.అయితే తన రెండవ సినిమా గా “మహాసముద్రం “ను పట్టలెక్కించే పనిలో ఉన్నాడు భూపతి.అయితే శర్వానంద్ కు ఈ కథ బాగా నచ్చిందట.సినిమా చేసేందుకు ఒకే కూడా చెప్పాడట శర్వా…

ఈ సినిమా కి హీరో ఫైనల్ అయ్యాడు కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ అవడం లేదు.ఇప్పటికే 3, 4 పేర్లు కూడా వినిపించాయి.మొదట సమంత కన్ఫర్మ్ అయింది అన్నారు.తర్వాత సమ్మోహనం సినిమా తో ప్రేక్షకలను సమ్మోహ పరచిన బ్యూటీ అదితిరావు హైదరి అన్నారు.అయితే ఇప్పుడు తాజాగా మరో నటి వేరు తెరమీదకు వచ్చింది.తనే ఫిదా ఫేమ్ సాయి పల్లవి.ఇప్పటికే శర్వా ,పల్లవి కలిసి పడి పడి లేచే మనసు లో నటించారు..ఇపుడు మహా సముద్రం స్టోరీ నచ్చడం తో సాయి పల్లవి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర కాబట్టే పల్లవి కూడా ఓకే చెప్పిందని టాక్..

Related Articles

Back to top button
Send this to a friend