మహాశివరాత్రి కానుకగా ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’


శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ పర్వదినాన మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నిర్మాత ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ. మాగ్నమ్ ఓపస్ (Magnum Opus) ఫిలిమ్స్ పతాకం‌పై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ – ప్రేమ మధ్యలో భామ!’. అమిత్ మరియు ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘మహాశివరాత్రి కానుకగా మా చిత్రం ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’ విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుందని తెలియజేసేందుకు మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించగలరని కోరుతున్నాము..’’ అని అన్నారు.

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి; సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు
నిర్మాత: ఎస్.ఎన్ లక్ష్మీనారాయణ

Related Articles

Back to top button
Send this to a friend