మళ్లీ బిజీ అవుతోన్న అజ్ఞాతవాసి సోయగం
అనూ ఇమ్మానుయేల్.. తెలుగులో సాధారణంగా కెరీర్ మొదలుపెట్టినా తన హొయలు, అందంతో చాలా త్వరగానే పవన్ కళ్యాణ్ సరసన ఆఫర కొట్టేసింది. పైగా త్రివిక్రమ్ సపోర్ట్ కూడా ఉండేది. అల్లు అర్జున్ సరసన చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా పోయింది. నిజానికి అమ్మడికి బ్యాక్ లక్ బ్యాక్ పాకెట్ లోనే ఉంది. అందుకే తను చేసిన ఏ సినిమా కూడా ఆడలేదు. వరుసగా అన్నీ ఫ్లాపులే. యాక్టింగ్ విషయంలో నిల్ అయినా గ్లామర్ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టే అన్ని ఛాన్సులు వచ్చాయి. అయినా ఫ్లాపులు రావడంతో ఇక తనను పక్కన బెట్టింది టాలీవుడ్. ఈ టైమ్ లో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడా సేమ్ సీన్. ఇక తన పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఒక రకంగా చెబితే తను ఒకవేళ తమిళ్ లోనో లేక కన్నడలోనో బిజీ కావడం తప్ప ఇక తెలుగులో అసాధ్యం అనుకున్నారు. కానీ అనూహ్యంగా బౌన్స్ బ్యాక్ అవుతోందీ బ్యూటీ.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా తెలుగులో మరో ప్రాజెక్ట్ లో సైన్ చేసింది. నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘18 పేజెస్’అనే సినిమాలోనూ అమ్మడికి సెకండ్ లీడ్ ఆఫర్ చేశారు. వెంటనే సైన్ చేసింది. ఈ మూవీలో ఫస్ట్ లీడ్ లో కొత్త కుర్రది ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది. కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప్రతాప్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోంది. అంటే అనూకు లక్ తిరిగే అవకాశాలున్నాయి.
మరోవైపు తమిళ్ లో కొన్ని, మళయాలంలోనూ మరికొన్ని సినిమాల్లో చేస్తోంది. మొత్తంగా అమ్మడి పని అయిపోయింది అనుకుంటోన్న టైమ్ లో ఇలా సడెన్ గా బౌన్స్ బ్యాక్ కావడం ఆశ్చర్యమే.